కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. మంత్రులు వీరే

కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. మంత్రులు వీరే

మహారాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కేబినెట్‌లో 18 మందికి అవకాశం కల్పించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రివర్గంలో బీజేపీ నుంచి తొమ్మిది, షిండే వర్గం నుంచి 9 మందికి చోటు లభించింది. మంత్రులుగా రాధాకృష్ణ విఖే పాటిలావ్‌, సుధీర్‌ ముంగంటి వార్‌, చంద్రకాంత పాటిల్‌, విజయ్‌కుమార్‌ గావిట్‌, గులాబ్‌రావ్‌ పాటివ్‌, దాదాపు భూసే, సంజయ్‌ రాథోడ్‌, సురేష్‌ ఖాడే, సందీపన్‌ బుమ్రే, ఉదయ్‌ సమంత్‌,  తానాజీ సావంత్‌, రవీంద్ర చవాన్‌, అబ్దుల్‌ సతార్‌, దీపక్‌ కేస్కర్‌, అతుల్‌ సేవ్‌, శుభురాజ్‌ దేశాయ్‌, మంగళ్‌ ప్రభాత్‌ లోధా ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర సింగ్‌ ఫడ్నవీస్‌ హాజరయ్యారు.

 

Tags :