మహేష్ " మసాలా " లుక్స్ కి ఫాన్స్ ఫిదా...

మహేష్ " మసాలా " లుక్స్ కి ఫాన్స్ ఫిదా...

ఎప్పటికప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన లుక్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటాడు. సర్కారు వారిపాట లో మహేష్ తన హెయిర్ స్టైల్ తో ఫాన్స్ ని ఖుషీ చేసాడు. మరికొందరు మాత్రం ఇంకొంచెం బెటర్ గా ఉంటే మహేష్ లుక్ పర్ఫెక్ట్ గా ఉండేదని అన్నారు.

కొందరికి మహేష్ హెయిర్ స్టైల్ పై కామెంట్స్ చేయడం అలవాటైపోయింది అని చెప్పాలి. అయితే తాజాగా ఒక మసాలా కంపెనీకి చెందిన యాడ్ లో మహేష్ లుక్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసిందట.

ఆ యాడ్ లో మహేష్ హెయిర్ స్టైల్ మొదలుకొని మీసం , గడ్డం వరకు ప్రతిఒక్కటి భలేగా సెట్ అయ్యాయి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ యాడ్ మరియు మహేష్ న్యూ లుక్ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా, మహేష్ సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా పట్టాలెక్కింది. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందని , ఈ నెలలో కీలకమైన షెడ్యూల్ ని పూర్తి చేసుకుంటుంది అని సమాచారం.

సంక్రాంతి తర్వాత మిగిలిన షెడ్యూల్ ని కంప్లీట్ చేస్తారట. ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల చేయాలని ముందు అనుకున్నా, షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఎప్పటికి రిలీజ్ చేస్తారో చూడాలి..

 

 

Tags :