'సర్కారు వారి పాట' బిగ్గెస్ట్ రికార్డ్! నెవర్ బిఫోర్!! USAలో ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుందో తెలుసా?

'సర్కారు వారి పాట' బిగ్గెస్ట్ రికార్డ్! నెవర్ బిఫోర్!! USAలో ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుందో తెలుసా?

బాక్సాఫీస్ బూజు దులపడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట'  వచ్చేవారం విడుదలకు  రెడీ అయింది. మే 12న ఈ సినిమా  దేశవిదేశాల్లో బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది ఈ మూవీ  ఇప్పటికే ఈ చిత్రంలో పాటలు, ట్రైలర్ విశేషంగా మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వుంటాయని చర్చలు జరుగుతున్నాయి.  పలు విదేశాల్లో  విడుదల అవుతుండగా ముఖ్యంగా అల్ ఓవర్ USAలో అయితే 'సర్కారు వారి పాట' అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నెవర్ బిఫోర్ అనేలా అత్యధిక థియేటర్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

అల్ ఓవర్ USA లోని ఏకంగా 603 లొకేషన్స్ లో షుమారు వెయ్యి థియేటర్లకు పైగా ఈ సినిమాను మే 11న ప్రీమియర్ షోస్ పడుతుండడంతో మహేష్  అభిమానులను మరింత సంబరపెడుతోంది. ఈ రేంజ్ రిలీజ్ అంటే ఈ సినిమా సృష్టించే అలజడి ఊహించగలమా అంటూ ఆనందంగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.USA లో  'సర్కారు వారి పాట' చిత్రాన్నిఫ్లయిహై సినిమాస్, శ్లోక ఎంటెర్టైన్మెంట్స్, మరియు క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్, సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వున్నారు. ఇంకా  వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట బ్యానర్లు: సంగీత దర్శకుడు: థమన్ ఎస్ఎస్ సినిమాటోగ్రఫీ: ఆర్ మధి ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్ ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్ ఫైట్స్: రామ్ - లక్ష్మణ్\ లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్ కో-డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్ CEO: చెర్రీ VFX సూపర్‌వైజర్ - యుగంధర్.

 

 

Tags :