రవితేజ హీరోయిన్ ను మహేష్ బాబు కోసం ఫైనల్ చేసిన త్రివిక్రమ్?

రవితేజ హీరోయిన్ ను మహేష్ బాబు కోసం ఫైనల్ చేసిన త్రివిక్రమ్?

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' పాటల చిత్రీకరణ తో బిజీగా ఉన్న మహేష్ బాబు.. తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ విషయమై ఓ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించినప్పుటి నుంచి దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ హీరోయిన్ విషయమై ఓ విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌‌గా మోడల్‌, మిస్‌ ఇండియా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. చిత్రంలో ఓ హీరోయిన్ క్యారెక్టర్‌ బలంగా ఉంటుందని, ఇందుకోసం త్రివిక్రమ్ పక్కాగా ప్లాన్ చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అంటున్నారు. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి ఇప్పటికే మాస్‌ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటించే చాన్స్‌ పట్టేసింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తాడని, తన తండ్రి ఓ డాన్ అని తెలుసుకున్న హీరో, కొన్ని పరిస్థితుల్లో తండ్రితోనే పోరాటం చేయడం జరుగుతుందనే టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆ డాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట.

 

Tags :