తండ్రికి తగ్గ తనయుడు: గౌతమ్ ఘట్టమనేని...

తండ్రికి తగ్గ తనయుడు: గౌతమ్ ఘట్టమనేని...

సువర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని " 1 -నేనొక్కడినే " చిత్రం తో బాల నటుడిగా తెరకు పరిచయం అయినా విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించగా , తొలి ప్రయత్నం లోనే ఎటువంటి తడబాటు లేకుండా నటించి ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు గౌతమ్.

ఈ సినిమాలో మాస్టర్ గౌతమ్ ని చూసిన అభిమానులు ఘట్టమనేని వంశం ఫ్యూచర్ స్టార్ అవుతాడంటూ ఆశీస్సులు అందించారు. గౌతమ్ ఇప్పుడు టీనేజ్ లోకి వచ్చేసాడు. ఇకపై అతడితో టీనేజ్ లవ్ స్టోరీస్ ని ఎలా వర్క్ అవుట్ చేయాలా ? అని దర్శకనిర్మాతలు ఆలోచించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక గౌతమ్ ఘట్టమనేని స్వతహాగా సిగ్గుగా కనిపిస్తాడు. రీసెంట్ గా తన మొట్టమొదటి థియేటర్ పెర్ఫార్మన్స్ లో అతడు  అద్భుతంగా నటించి ఆశ్చర్యపరిచాడు. అతడిలోని మ్యాన్లీ నెస్ కి ఇది సింబాలిక్ గా కనిపిస్తుంది. ఈ పెర్ఫార్మన్స్ చూసిన సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

మహేష్ సతీమణి, గౌతమ్ తల్లి అయిన నమ్రత శిరోద్కర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. " ఇంతకంటే ఎక్కువ చూడడానికి వేచి ఉండలేను " అనే కాప్షన్ తో సోషల్ మీడియాలో గౌతమ్ ఫస్ట్ పెర్ఫార్మన్స్ ని ఆమె షేర్ చేసారు. దీనిని ఫాన్స్ నిమిషాలలో వైరల్ చేసిన సంగతి తెలిసిందే.

గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. అతడు హైస్కూల్ దశలోనే థియేటర్ శిక్షణ ప్రారంభించాడని ఈ పెర్ఫార్మన్స్ ని చూసి అర్ధంచేసుకోవొచ్చు. ఈ వీడియో ని నమ్రత తన ఇంస్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేయగా లైక్స్ , షేర్స్ తో సోషల్ మీడియా మారుమ్రోగింది.

డిస్నీస్ ఫ్రోజెన్ ఆధారంగా రూపొందించిన ఈ నాటకంలో గౌతమ్ "క్రిస్టాఫ్" పాత్రలో అద్భుతంగా కనిపించారు. తన సహ నటితో ఎక్కడ తొణకకుండా డైలాగ్స్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. "ఇంకా అతడు బాలకుడు, ప్రేమలో నిపుణుడు కాదు. కానీ, తనకి స్నేహితులు ఉన్నారు. హైస్కూల్ లో మొదటి థియేటర్ పెర్ఫార్మన్స్ లో గౌతమ్ చాలా స్టైలిష్ గా ఉన్నారు" అని నమ్రత తన పోస్ట్ లో గౌతమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

"ఫ్రోజెన్" ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీడియోలో మూడు విషయాలు ప్రేక్షలకులని ఆకర్షించాయి. ఒకటి గౌతమ్ డైలాగ్ డెలివరీ. రెండవది అతడి డాన్స్ పెర్ఫార్మన్స్. మూడవది తన సహ నటీనటులతో ఎంతో సౌకర్యంగా నటించగలగడం. నటుడిగా అరంగ్రేటానికి ఈ క్వాలిటీస్ సరిపోతాయి కనుక , ఇక ఎప్పుడెప్పుడు తమ అభిమాన సినీ వారసుడిని వెండి తెరపై వీక్షించాలా అని ప్రేక్షకులు మరియు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...

 

 

Tags :