ఆస్ట్రేలియా సిడ్నీలో మాథ్యూ బ్లాక్మోరే (మేయర్ స్ట్రాత్ఫిల్డ్ కౌన్సిల్) తో మహేష్ బిగాల భేటీ

ఆస్ట్రేలియా సిడ్నీలో మాథ్యూ  బ్లాక్మోరే (మేయర్ స్ట్రాత్ఫిల్డ్  కౌన్సిల్) తో మహేష్ బిగాల భేటీ

ఆస్టేలియా లో మహేష్ బిగాల పర్యటిస్తున్నారు, ఈ పర్యటనలో భాగంగా స్ట్రాత్‌ఫీల్డ్ (సిడ్నీ లో ) కౌన్సిల్ మేయర్ మాథ్యూ బ్లాక్మోరే (స్ట్రాత్ఫిల్డ్ కౌన్సిల్) తో భేటీ అయ్యారు. మహేష్ బిగాల మాట్లాడుతూ ఈ భేటీలో తెలంగాణ లో ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి అలాగే పీవీ నరసింహ్మ రావు గారి విగ్రహ ఏర్పాటు గురించి మేయర్ తో చర్చించారు, దానికి అయన సముఖత వ్యక్త పరిచారు, అలాగే స్ట్రాత్ఫిల్డ్ లో మన భారతీయులు 16 % వరకు వున్నారని అని అన్నారు అందులో మన తెలుగు వారు ఎక్కువగా వున్నారు. అలాగే తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి మొట్ట మొదటి సారి కౌన్సిల్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించడం గర్వకారణం అన్నారు.

మన తెలంగాణ లో కెసిఆర్ గారి అద్వ్యరములో జరుగుతున్న రాష్ట్ర పురోగతిని, కేటీర్ గారు తెస్తున్న పెట్టుబడుల గురించి మేయర్ కి మహేష్ బిగాల వివరించారు. రాబోయే రోజుల్లో ట్రేడ్, కల్చరల్ వివిధ రంగాలలో తెలంగాణ తో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్త పరిచారు, త్వరలో పీవీ నరసింహ్మ రావు గారి విగ్రహ ఏర్పాటు గురించి కౌన్సిల్ లో చర్చిస్తామన్నారు. అలాగే ఈ భేటీలో స్ట్రాత్ఫిల్డ్ కౌన్సిల్ కౌన్సిలర్ సంధ్య రెడ్డి, స్ట్రాత్ఫిల్డ్ ఇండిపెండెన్స్ ప్రెసిడెంట్ కర్రీ బూచి రెడ్డి, ఉపేందర్ గాదె పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

Tags :