వీడిన ఉత్కంఠ..! కాంగ్రెస్ అధ్యక్ష బరిలో మల్లికార్జున ఖర్గే.. గెలుపు ఖాయం..!!

వీడిన ఉత్కంఠ..! కాంగ్రెస్ అధ్యక్ష బరిలో మల్లికార్జున ఖర్గే.. గెలుపు ఖాయం..!!

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల కసరత్తు తారస్థాయికి చేరింది. అధ్యక్ష ఎన్నికల బరిలో చివరకు ఎవరెవరు నిలుస్తారనేదానిపై కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ఇవాల్టితో నామినేషన్లకు గడువు ముగుస్తుండడంతో బరిలో నిలిచేవారిపై స్పష్టత వస్తోంది. శశిథరూర్, మల్లికార్జున ఖర్గే చివరికి పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్ పేర్లు వినిపించినా చివరి నిమిషంలో వారు వైదొలిగారు. దీంతో ఎన్నికలపై క్లారిటీ వచ్చింది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి దాదాపు 2 దశాబ్దాల తర్వాత గాంధీయేతరులకు దక్కబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఈసారి గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు. పోటీ చేసేందుకు సోనియా, రాహుల్, ప్రియాంక ఆసక్తి చూపించలేదు. కొన్ని నెలలుగా అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ లో అంతర్మథనం కొనసాగుతోంది. గాంధీ ఫ్యామిలీనే బరిలో ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ముక్తకంఠంతో కోరాయి. ఎవరూ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ముందుకు రాలేదు. కచ్చితంగా సోనియా లేదా రాహుల్ మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలని అన్ని రాష్ట్రాల పీసీసీలు విజ్ఞప్తి చేశాయి. అయితే అనారోగ్యంతో సోనియా, అయిష్టంతో రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు నిరాకరించారు.

సోనియా, రాహుల్ ససేమిరా అనడంతో అధ్యక్ష పదవి ఎవరు చేపడతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇంతలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వైపు సోనియా గాంధీ మొగ్గు చూపారు. ఈ పదవి చేపట్టేందుకు ముందుకు రావాలని సోనియా విజ్ఞప్తి చేశారు. అయితే రాజస్థాన్ సీఎం పదవి వదులుకునేందుకు అశోక్ గెహ్లాట్ ససేమిరా అన్నారు. అయితే సోనియా అల్టిమేటంతో సీఎం పదవి వదులుకుని ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అంగీకరించారు. అయితే అందుకు అశోక్ గెహ్లాట్ వర్గీయులు అస్సలు ఒప్పుకోలేదు. అశోక్ గెహ్లాట్ ను సీఎంగా కొనసాగించాలని.. లేకుంటే తాము రాజీనామాకైనా సిద్ధమని ప్రకటించారు. ఏఐసీసీ పరిశీలకులతో సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వాళ్లకు నోటీసులు జారీ చేసింది. తన వర్గీయులు చేసిన పని అశోక్ గెహ్లాట్ సోనియాకు సారీ చెప్పారు. అశోక్ గెహ్లాట్, ఆయన వర్గీయులు వ్యవహరించిన తీరుపై సోనియా గుర్రుగా ఉన్నారు. ఆయన్ను త్వరలోనే సీఎం పదవి నుంచి కూడా తప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అశోక్ గెహ్లాట్ తప్పుకోవడంతో ఇంకెవర్ని బరిలోకి దింపుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. చివరకు మల్లికార్జున ఖర్గేను బరిలోకి దిగాలని సోనియా ఆదేశించారు. దీంతో ఖర్జే నామినేషన్ వేసేందుకు ఓకే అన్నారు. అంతకుముందు దిగ్విజయ్ సింగ్ అధ్యక్ష పదవిలో దిగుతానని ప్రకటించారు. నామినేషన్ పత్రాలు కూడా తీసుకున్నారు. అయితే చివరి నిమిషంలో మల్లికార్జున ఖర్గే బరిలోకి దిగుతున్నారని తెలిసి దిగ్విజయ్ సింగ్ తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను పార్టీకి విధేయుడినని.. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని వెల్లడించారు. మరోవైపు ఖర్గేకు పోటీగా జీ23 నేత శశిథరూర్ బరిలో నిలుస్తున్నారు. దీంతో ఖర్జే, శశిథరూర్ మధ్య ఎన్నిక జరగనుంది. సోనియా, రాహుల్ అండదండలు ఉండడంతో మల్లికార్జున ఖర్గేకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్గే, థరూర్ లలో ఎవరు గెలిచినా దక్షిణాదికే ఈసారి అధ్యక్ష పదవి దక్కనుంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.