ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు..వెంటనే చర్యలు

ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు..వెంటనే చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీఎల్పీ సమావేశంలో చర్చించినట్లు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద నష్టంపై ఇప్పటి వరకు ప్రభుత్వం అంచనా వేయలేదని తెలిపారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టేవన్నారు. ఈ నెల 9 నుంచి 15 వరకు ప్రతి జిల్లాలో 75 కి.మీ.ల పాదయాత్ర చేయాలని ఏఐసీసీ ఆదేశించిందన్నారు.

స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌కు తాళం వేశారని ఆక్షేపించారు. స్వాతంత్య్రం తీసుకొచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై కక్ష కట్టారని ఆరోపించారు. ఈ నెల 16 నుంచి రెండు, మూడు రోజుల పాటు సీఎల్పీ బృందం భద్రాచంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. కడెం ప్రాజెక్టును కూడా సందర్శించనున్నట్టు తెలిపారు.

 

Tags :