ఆయన బీజేపీలో ఎందుకు చేరుతున్నారో

ఆయన బీజేపీలో ఎందుకు చేరుతున్నారో

మర్రి శశిధర్‌ రెడ్డి ఎందుకు బీజేపీలో చేరుతున్నారో చెప్పలేదని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను బీజేపీ ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చింది అంటే కాంగ్రెస్‌ పార్టీ వల్లనేనని తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్యలు లేకుండా చేయాలనే కాంగ్రెస్‌ బిల్లు పెట్టి రాష్ట్రం ఇచ్చిందన్నారు. విభజన చట్టంలోని హామీలు బీజేపీ ఎందుకు అమలు చేయలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను అందివ్వలేదన్నారు. 

 

Tags :
ii). Please add in the header part of the home page.