పశ్చిమ బెంగాల్ మంత్రివర్గ పునవ్యవస్థీకరణ.. కొత్తగా తొమ్మిది మందికి

పశ్చిమ బెంగాల్ మంత్రివర్గ పునవ్యవస్థీకరణ.. కొత్తగా తొమ్మిది మందికి

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గంలో పలు మార్పులు చేశారు. మంత్రివర్గంలో తొమ్మిది మందికి కొత్తగా స్థానం కల్పించారు. ఇందులో బీజేపీ నుంచి తృణమూల్‌లో చేరిన మాజీ కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు సైతం చోటు దక్కింది. మంత్రులు కోల్‌కతాలో ప్రమాణ స్వీకారం చేశారు. బాబుల్‌ సుప్రియోతో పాటు స్నేహసిన్‌ చక్రవర్తి, పార్థ భౌమిక్‌, ఉదయన్‌ గుహ, ప్రదీప్‌ మజుందార్‌, తజ్ముల్‌ హుస్సేన్‌, సత్యజిత్‌ బర్మన్‌, బిర్బాహా హన్స్‌దా, బిప్లబ్‌ రాయ్‌ చౌదరి మంత్రులుగా ప్రమాణం చేశారు.  ప్రస్తుతం మమత ప్రభుత్వంలో 21 మంది కేబినెట్‌ మంత్రులు, 10 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు, తొమ్మిది మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అసెంబ్లీలో ఉన్న శాసన సభ్యుల సంఖ్య మేరకు 44 మంది వరకు మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉన్నది.

 

Tags :