భారతీయ అమెరికన్ ప్రమీలా జయపాల్ కు.. బెదిరింపులు

భారతీయ అమెరికన్ ప్రమీలా జయపాల్ కు.. బెదిరింపులు

ప్రముఖ భారతీయ అమెరికన్‌, అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. పశ్చిమ సియాటిల్‌లో ఈ నెల 9న జయపాల్‌ ఇంటి వద్దకు వెళ్లిన బ్రెట్‌ ఫార్సెల్‌ (49) అనే వ్యక్తి, భారత్‌కు వెనక్కి వెళ్లిపో అంటూ ఆమెను ఉద్దేశించి పలుమార్లు గట్టిగా అరిచాడు. తుపాకీ చూపిస్తూ ఆమెను చంపేస్తామని బెదిరించాడు. జయపాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు అతణ్ని అదే రోజు అరెస్టు చేసి అభియోగాలు నమోదు చేశారు. తాను విడుదలైన వెంటనే మళ్లీ జయపాల్‌ ఇంటికి వెళ్తానని ఫార్సెల్‌ పోలీసులతో పేర్కొన్నారు. అతడు బయట ఉంటే హింసాత్మక నేరాలకు పాల్పడే ప్రమాదం ఉండటంతో కఠిన అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు.

 

Tags :