48 గంటల్లోగా రూ.50 కోట్లు ఇవ్వాలి... లేదంటే

ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌ను బెదిరిస్తూ ఓ లేఖ రావడం కలకలం సృష్టించింది. రూ.50 కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు అందులో డిమాండ్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లేఖపై దర్యాప్తు చేపట్టగా ఓ ఖైదీ దాన్ని పంపించినట్లు తేలింది. ఛత్తీస్‌గఢ్ లోని పాత్రపాలిలో గల జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ప్యాక్టరీకి గతవారం పోస్టు ద్వారా ఓ లేఖ వచ్చింది. నవీన్ జిందాల్ 48 గంటల్లోగా రూ.50 కోట్లు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ఆ బెదిరింపు లేఖను పంపాడు. దీంతో జిందాల్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాగా బిలాస్పూర్ సెంట్రల్ జైలులోని ఓ ఖైదీ దీన్ని పంపినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అయితే దీని వెనుక కారణాలు తెలియరాలేదు. నిందితుడు ఎవరనే వివరాలను కూడా పోలీసులు బయటపెట్టలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.