యూఎస్ క్యాపిటల్ వద్ద అనూహ్య ఘటన

యూఎస్ క్యాపిటల్ వద్ద అనూహ్య ఘటన

వాషింగ్టన్‌లోని యూఎస్‌ క్యాపిటల్‌ భవన సముదాయం వద్ద ఆదివారం వేకువజామున అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుతో వచ్చి క్యాపిటల్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టాడు. వాహనం దిగి గాల్లోకి కాల్పులు జరిపాడు. తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అతడు దిగగానే మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో భవన సముదాయంలో కొద్ది మంది సిబ్బందే ఉన్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాలు జరిపినప్పటి నుంచి ఫెడరల్‌ అధికారులకు బెదిరింపులు, ప్రభుత్వం భవనాలపై దాడులు జరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

 

Tags :