భారీ మెజారిటీ తో ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు మంచు

భారీ మెజారిటీ తో ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు మంచు

ఆదివారం(అక్టోబ‌ర్ 10) రోజున జ‌రిగిన ‘మా’ ఎన్నిక‌ల్లో హీరో విష్ణు మంచు ‘మా’ అధ్య‌క్షుడిగా ప్రకాశ్ రాజ్‌పై విజ‌యం సాధించారు. సినీ ఆర్టిస్ట్ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(‘మా’) ఎన్నిక‌లు ర‌స‌వత్త‌రంగా ముగిశాయి. ఆదివారం(అక్టోబ‌ర్ 10) రోజున జ‌రిగిన ఎన్నిక‌ల్లో హీరో విష్ణు మంచు ‘మా’ అధ్య‌క్షుడిగా విజ‌యం సాధించారు.‘మా’ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా 665 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో 44 ఓట్లను ఈసీ చెల్లని ఓట్లుగా గుర్తించింది. ఇక మిగిలిన ఓట్లలో విష్ణు మంచుకు 400కి పైగా ఆధిక్యం వచ్చింది. మంచు విష్ణు గెలవడంతో ప్రాంగణం అంతా జై జగన్ అంటూ నినాదాలతో మారుమ్రోగిపోవటం విశేషం. అలాగే కొంత మంది జై మోహన్ బాబు, జై టైగర్ అంటూ నినాదాలు కూడా చేశారు.

ప్రారంభం నుంచి విష్ణు మంచు ప్యానెల్ స్పీడు చూపించింది. జనరల్ సెక్రటరీగా జీవితపై రఘుబాబు విజయం సాధించగా, ట్రెజరర్‌గా శివబాలాజీ, నాగినీడుపై విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన శ్రీకాంత్, బాబూ మోహన్‌పై విజయం సాధించారు. 8 ఆఫీస్ బేరర్స్ స్థానాల్లో విష్ణు ప్యానెల్ 6 స్థానాల్లో విజయం సాధించింది. జాయింట్ సెక్రటరీగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన ఉత్తేజ్‌తో పాటు విష్ణు ప్యానెల్‌కు చెందిన గౌతంరాజు విజయం సాధించారు. అలాగే వైస్ ప్రెసిడెంట్స్ విషయానికి వస్తే ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన హేమ, విష్ణు మంచు ప్యానెల్‌కు చెందిన మాదాల రవి గెలిచారు.

విష్ణు మంచు ప్యానెల్‌ను గ‌మ‌నిస్తే.. ర‌ఘుబాబు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా.. బాబూ మోహ‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా.. వైస్ ప్రెసిడెంట్స్‌గా మాదాల ర‌వి, 30 ఇయ‌ర్స్ పృథ్వీ.. జాయింట్ సెక్ర‌ట‌రీలుగా క‌రాటే క‌ళ్యాణి, గౌత‌మ్ రాజు, ట్రెజ‌ర‌ర్‌గా శివ బాలాజీ, ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్స్ విష‌యానికి వ‌స్తే.. అర్చ‌నా వేద‌, అశోక్ కుమార్‌, గీతా సింగ్‌, హ‌రినాథ్ బాబు, జ‌య‌వాణి, మ‌ల‌క్ పేట శైల‌జ‌, మానిక్, పూజిత‌, రాజేశ్వ‌రి రెడ్డి, రేఖ‌, సంపూర్ణేష్ బాబు, శ‌శాంక్‌, శివ‌న్నారాయ‌ణ‌, శ్రీల‌క్ష్మి, శ్రీనివాసులు.పి, స్వ‌ప్న మాధురి, విష్ణు బొప్ప‌న‌, వ‌డ్ల‌ప‌ట్ల మోహ‌న్ పోటీ చేశారు.

అలాగే ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో ..జీవితా రాజ‌శేఖ‌ర్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా, శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, వైస్ ప్రెసిడెంట్స్‌గా బెన‌ర్జీ, హేమ‌.. జాయింట్ సెక్ర‌ట‌రీగా ఉత్తేజ్‌, అనితా చౌద‌రి, ట్రెజ‌ర‌ర్‌గా నాగినీడు, అన‌సూయ, రోహిత్‌, భూపాల్‌, బ్ర‌హ్మాజీ, ఈటీవీ ప్ర‌భాక‌ర్ రావు, గోవింద‌రావు, ఖ‌య్యూమ్‌, కౌశిక్‌, ప్ర‌గ‌తి, కొండేటి సురేశ్‌, శివారెడ్డి, శ్రీధ‌ర్ రావు, స‌మీర్‌, సుడిగాలి సుధీర్‌, సుబ్బ‌రాజు, ర‌మ‌ణారెడ్డి, త‌నీశ్‌, టార్జాన్‌లు పోటీ ప‌డ్డారు.

President : Manchu Vishnu; Srikanth - (Executive Vice President)

Madala ravi ( Vice President); Hema (Vice President)

Raghu babu (General Secretary); Gautham raju (Joint Secretary)

Uttej - ( joint secretary); Shiva balaji (Treasurer)

EC Members.... 1.Khayyum 2. Siva reddy 3. Bramhaji 4. Kaushik 5. Suresh Kondeti 6. Sampoornesh 7. Koushik 8. Pragathi 9. Anasuya 10. Sri Laxmi 11. Manik

 

 

Tags :