ఢిల్లీ లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా.. మందా జగన్నాథం

ఢిల్లీ లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా.. మందా జగన్నాథం

ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పార్లమెంటు మాజీ సభ్యుడు మందా జగన్నాథం నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఆయన గతంలో కూడా ఈ పదవిని నిర్వహించారు. ఈ సందర్భంగా మందా జగన్నాథం మంత్రి కేటీఆర్‌ను కలిసి తనను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు..

 

Tags :