చికాగోలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ‘మీట్ అండ్ గ్రీట్’

చికాగోలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ‘మీట్ అండ్ గ్రీట్’

చికాగో: మాజీ డిప్యూటీ స్పీకర్‌, మంత్రివర్యులు మండలి బుద్ధ ప్రసాద్‌ చికాగో పర్యటన సందర్భంగా ఎన్నారై టీడీపీ అమెరికా కోఆర్డినేటర్‌ కోమటి జయరాం పర్యవేక్షణలో స్థానిక టీడీపీ నాయకులు హేమ కానూరు ఆధ్వర్యంలో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీడీపీ అభిమానులు, ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యుగంధర్‌ యడ్లపాటి అధ్యక్షత వహించారు. మురళి మేరుగ శాలువాతో  బుద్ధ ప్రసాద్‌ను సన్మానించారు.

ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్‌ అభిమానులను ఉద్దేశిస్తూ వర్తమాన రాజకీయాలతో పాట తెలుగు జాతి వైభవాన్ని గుర్తు చేశారు. అనేక మంది ప్రముఖులు, అన్న నందమూరి తారక రామారావు హయాంలో తెలుగు జాతికి లభించిన గుర్తింపు నుంచి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధి వరకు ప్రస్తావించడం జరిగింది. తెలుగు జాతి ఔనత్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించగల నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నారై టీడీపీ చికాగో ప్రతినిధులు రవి కాకర, చిరంజీవి గల్లా, కృష్ణ మోహన్‌, హను చెరుకూరి, శివ త్రిపురనేని, వినోజ్‌ చనుమోలు, రఘు చిలుకూరి, కిషోర్‌ త్రిపురనేని, పవన్‌ నల్లమల్ల తదితరులు  సమన్వయపరిచి విజయవంతం కావడంలో తోడ్పడ్డారు.

 

Tags :