త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. బీజీపీ అధిష్టానం సూచన మేరకు బిప్లబ్ కుమార్ దేవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ శాసన సభా పక్షం మాణిక్ సాహాను తమ నేతగా ఎన్నుకుంది. అనంతరం సాహా రాజ్ భవన్లో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి, ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరారు. మాణిక్ సాహా లక్నోకింగ్ జార్జి మెడికల్ కాలేజ్లో మాక్సిలోఫేషియల్ సర్జన్. ఆయన 2016 కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరారు. 2020లో త్రిపుర బీజేపీ చీఫ్గా నియమితులయ్యారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కూడా ఆయన సాహా త్రిపుర క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Tags :