సెంట్రల్ ఒహాయోలో వీనులవిందు చేసిన మణిశర్మ మ్యూజికల్ నైట్

సెంట్రల్ ఒహాయోలో వీనులవిందు చేసిన మణిశర్మ మ్యూజికల్ నైట్

ఒహాయోలో విజువల్‌ యాడ్స్‌ అండ్‌ జేపీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పించిన మెలొడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజికల్‌ నైట్‌ శ్రోతలకు వీనుల విందు చేసింది. జూన్‌ 4, శనివారంనాడు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సుశీల ఉప్పుటూరి, మంజూష అక్కపెద్ది, రాజా బొమ్మన, జగదీష్‌ ప్రభల నిర్వహించారు. 

భవధీవుడు బాలుగారు పేరుతో గాన గంధర్వుడు డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్థం నిర్వహించిన ఈ మణిశర్మ మ్యూజిక్‌ షో లో యువ గాయనీ గాయకులు పాల్గొని, ఆయన ఆలపించిన మేలిమిరత్నాల్లాంటి పాటలను పాడి శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారు. మణిశర్మ, ఇండియన్‌ ఐడల్‌ రేవంత్‌, బిగ్‌ బాస్‌ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌, పవన్‌ బోనిల, లిప్సికా భాష్యం, అంజనా సౌమ్య, అఖిల  మమందార్‌ సహా పలువురు కళాకారులు పాటలను పాడారు. సుధీర్‌ పోలవరపు, సుబ్బు నాయుడు, రవిశంకర్‌ వాధ్రి ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా సెంట్రల్‌ ఓహియోలోని ఎస్వీ టెంపుల్‌, ఆంధ్ర పీపుల్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఓహియో(ఆప్కో), కొలంబస్‌ తెలంగాణ అసోసియేషన్‌(సీటీఏ) ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో టికెట్‌ల విక్రయం ద్వారా సుమారు 75 వేల అమెరికన్‌ డాలర్లను ఫండ్‌ రూపంలో ఎస్వీ టెంపుల్‌ కమిటీ నిర్వాహకులు సేకరించారు. కార్యక్రమం నిర్వాహకులు యూఎస్‌ దేశీ ఐడల్‌ మ్యూజిక్‌ కాంపిటీషన్‌ను కూడా నిర్వహించారు. దీనిలో సుమారు 45 మంది గాయకులు పాల్గొన్నారు. ఈ పాటల పోటీ సుమారు 14కు పైగా రాష్ట్రాల్లో నిర్వహించారు. తుది పోటీలను జూన్‌ 3న కొలంబస్‌ ఓహెచ్‌లో నిర్వహించారు. ఈ కాంపిటిషన్‌లో గీతా కులకర్ణి విజయం సాధించారు. ఈ కార్యక్రమం సహ మీడియా నిర్వాహకులుగా టీవీ 5 శ్రీధర్‌ చిల్లర వ్యవహరించారు. అదేవిధంగా ఈ పాటల పోటీ న్యాయనిర్ణేతలుగా మణిశర్మ, పవన్‌ బోనిల, అఖిల మమందార్‌, అన్నపూర్ణ కౌతా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి సహాయకులుగా శరత్‌కుమార్‌, రాగిని, సుందర్‌, హరీష్‌, రాజు వ్యవహరించారు. 

వర్ణ గ్రూప్‌.. మెడికల్‌ హెల్త్‌ కేర్‌ గ్రూప్‌, యునైటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ గ్రూప్‌-అంజు వల్లభనేని, ఇఆర్‌పి గ్రూప్‌-శ్రీకాంత్‌ గడ్డం, ఐసాఫ్ట్‌ గ్రూప్‌ - అశోక్‌ ఎల్లెందుల, వాసవి డెవలపర్స్‌, దావత్‌ రెస్టారెంట్లు ` టిపి రెడ్డి, ఎఐఎ ఆసియా భారతీయ కూటమి- సంజయ్‌ సదన,  బావర్చి -శ్రీధర్‌ కేసాని, కోటా కన్‌స్ట్రక్షన్స్‌- ఆనంద్‌ కోట, స్మాక్ట్‌ వర్క్స్‌-రంజిత్‌ యెంగోటి, చేతన ఫౌండేషన్‌ ` రవి పొట్లూరి, సామ్‌ క్యూఎ- రవి సామినేని, నెచెస్‌, ఇండియన్‌ ఫాస్ట్‌ ఫుడ్స్‌, కోల్డ్‌వెల్‌ బ్యాంకర్స్‌- అజయ్‌, హైదరాబాద్‌ హౌస్‌, భవానీ గ్రోసరీలు ఈ కార్యక్రమానికి సహ స్పాన్సర్‌ లుగా వ్యవహరించారు. 

ఈ కార్యక్రమానికి సపోర్టు చేసిన.. గణేష్‌ వట్యం, శాలినీ రెడ్డి, కేశవ్‌రెడ్డి, రామా బిలకంటి, శివ పట్టిసాపు, మోహన్‌ రెడ్డి, విక్రమ్‌ ప్రభల, వేణు పసుమర్తి, నాగేశ్వర మన్నే, మురళి పుట్టి, తేజో వట్టి, సుధాకర్‌రెడ్డి, రోహిత్‌ యమ, శ్రవణ్‌ సిరివోలు, శివ వ్యుదుల, రవి నల్లూరి, వినయ్‌ చెరుకుపల్లి, ప్రదీప్‌ చందనం, రామకృష్ణ కాసర్ల, అరిందం గుహ, నరేష్‌ ఇందూరి, పిక్సల్‌ రెయిన్‌బో ఫొటోగ్రాఫర్స్‌ సహా అనేక మందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పదుల సంఖ్యలో వలంటీర్లను తీసుకువచ్చి సహకరించిన సుధాకర్‌రెడ్డికి రాజా, సుష్‌, జగదీశ్‌ ప్రభల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

Click here for Event Gallery

 

 

Tags :