MKOne Telugu Times Business Excellence Awards

నాట్స్‌ మహాసభల్లో నృత్యార్పణ

నాట్స్‌ మహాసభల్లో నృత్యార్పణ

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 

సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి మంజుభార్గవి (శంకరాభరణం ఫేమ్‌) సమర్పించు నృత్యార్పణ కార్యక్రమం మరో ఆకర్షణగా నిలవనున్నది. న్యూ జెర్సిలోని కూచిపూడి నృత్యగురువులతో కలిసి ఈ నృత్య ప్రదర్శనను మంజు భార్గవి చేయనున్నారు. ఇందులో కవితా చౌదరి తోటకూర, రేణు నూకల, శ్రీదేవి ముంగర, ఇందిర శ్రీరామ్‌, అపర్ణ నాదెళ్ళ, దివ్య ఏలూరి నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 

 

 

Tags :