బైడెన్ సలహామండలిలో ఇద్దరు ప్రవాస భారతీయులు

బైడెన్ సలహామండలిలో ఇద్దరు ప్రవాస భారతీయులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జాతీయ వ్యవహారాల్లో తనకు సలహా ఇచ్చే మండలి సభ్యులు గా ఇద్దరు ప్రవాస భారతీయులను నియమించారు. బైడెన్‌ జాతీయ మౌలిక సదుపాయాల సలహా మండలి సలహాదారులుగా మను ఆస్తానా, మధు బేరివాల్‌ను నియమించారు. వీరు దేశాధ్యక్ష భవనంలో సైబర్‌, భౌతిక రిస్క్‌లను ఎలా తప్పించవచ్చోసలహా ఇస్తారు. అంతే కాకుండా దేశంలో కీలకమైన మౌలిక సదుపాయ రంగాల్లో మరింత మెరుగైన సేవలందించేందుకు కూడా సలహాలు ఇస్తారు. ఆస్తానా ఉత్తర అమెరికాలో అతి పెద్ద పవర్‌ గ్రిడ్‌ కార్యకలాపాలను పర్య వేక్షిస్తారు. ఉత్తర అమెరికా విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఆయన పర్యవేక్షిస్తారు. ఆయనకు విద్యుత్‌ రంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆయన టెక్సాస్‌లోని పిల్లల ఆస్పత్రి ట్రస్టీల బోర్డు సభ్యుడు, గ్రేటర్‌ ఫిల్‌ డల్పియా వాణిజ్య మండి సభ్యుడు మధు బేరివాల్‌ ఇన్నోవేటివ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌ మెంట్‌ను స్థాపించి ఆ సంస్థకు 1985 నుంచి సీఈవోగా కొనసాగుతున్నారు. 2012లో ఆమెను అంతర్జాతీయ మహిళా హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీలో సభ్యురాలిగా నియమించారు. అర్బన్‌ ప్లానింగ్‌లో ఆమె మాస్టర్స్‌ డిగ్రీ అర్హత కలిగి ఉన్నారు.

 

Tags :