రివ్యూ : రొటీన్ రివేంజ్ డ్రామా..బట్ డిఫ‌రెంట్ అట్టెంప్ట్ 'మరో ప్రస్థానం'

రివ్యూ  : రొటీన్ రివేంజ్ డ్రామా..బట్ డిఫ‌రెంట్ అట్టెంప్ట్ 'మరో ప్రస్థానం'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5

నిర్మాణ సంస్థలు : హిమాలయ స్టూడియో మెన్సషన్స్., ఓంకారేశ్వర క్రియేషన్స్, మిర్త్ మీడియా
నటీనటులు : తనీష్‌, ముస్కాన్ సేథీ , భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు
సంగీతం : సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ :ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటింగ్‌: క్రాంతి (ఆర్కే), నిర్మాతలు :  ఉదయ్ కిరణ్
దర్శకత్వం:  జాని
విడుదల తేది : 24.09.2021

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన తనీష్‌ ‘నచ్చావులే’తో హీరోగా మారాడు.   ఆ తర్వాత రైడ్‌, ‘మౌనరాగం’, ’ఏం పిల్లో ఏం పిల్లడో’ లాంటి సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కెరీర్‌ పరంగా తనీష్‌ ఎంతో  వెనుకబడ్డారు. ఈ క్ర‌మంలో విల‌న్‌గానూ మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.  ఆయన చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకున్న తనీష్‌.. చాలా కాలం తర్వాత ‘మరో ప్రస్థానం’తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం, సినిమా ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మరో ప్రస్థానం’పై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? ఈ సినిమా తనీష్‌ను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం

కథ:
హైద‌రాబాద్‌కు ముప్పై కిలోమీట‌ర్ల దూరంలో ఉండే భ‌వంతిలో ఓ పెద్ద మాఫియా గ్యాంగ్ ఉంటుంది. సిటీకి దూరంగా ఉండ‌టంతో ఎవ‌రికీ అనుమానం రాదు. ఆ మాఫియా గ్యాంగ్‌కు లీడ‌ర్ నారాయణ్ రావ్ రాణే(క‌బీర్ దుహాన్ సింగ్‌). పొలిటిక‌ల్ లీడ‌ర్స్ స‌పోర్ట్ ఉండ‌టంతో అత‌న్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. ముంబై మాఫియా డాన్ ఇబ్ర‌హీం(రవి కాలే)తో క‌లిసి గ‌ణ తంత్య్ర వేడుక‌ల్లో బాంబులు బ్లాస్టుల‌కు ప్లాన్ చేస్తాడు. క్రిమినల్ గ్యాంగ్ లో సభ్యుడు శివ (తనీష్). గ్యాంగ్ రాణేభాయ్‌( కబీర్ సింగ్ దుహాన్ )  ఈ గ్యాంగ్ లీడర్. ఆ గ్యాంగ్ నేరాల్లో తనూ భాగమవుతూ నేరమయ జీవితం గడుపుతుంటాడు శివ. ఇలా హత్యలు, కిడ్నాప్‌లంటూ తిరిగే శివ.. నైని (అర్చనా ఖన్నా) అనే అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. నైని కూడా శివను ప్రేమిస్తుంది. తన క్రిమినల్ జీవితానికి, నైని సరదా లైఫ్ కు సంబంధం లేదు. ఈ తేడానే శివను నైని ప్రేమలో పడేలా చేస్తుంది. నైనిని పెళ్లి చేసుకుని క్రిమినల్ లైఫ్ వదిలేసి కొత్త జీవితం ప్రారంభించాలని అనకుంటాడు శివ. గోవాలో కొత్త ఇంటిలోకి మారాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.  త‌న అన్యాయాల‌పై ఆధారాల‌ను సేక‌రించిన జ‌ర్నలిస్ట్ స‌మీర‌(భానుశ్రీ) కుటుంబంతో పాటు కొంత మంది అనాథ పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసి అక్క‌డికి తీసుకొస్తారు. అప్పుడు శివ ఓ ప్లాన్ చేస్తాడు. జ‌ర్న‌లిస్ట్‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తాడు. అస‌లు శివ అలా చేయ‌డానికి కార‌ణ‌మేంటి? రాణేకు ఎంతో న‌మ్మ‌కంగా ఉండే శివ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పుకు కార‌ణ‌మేంటి? శివ ప‌నిచేసే గ్యాంగులో ఉండే మ‌రో అమ్మాయి యువిద‌తో పాటు శివ జీవితంలో కీల‌క‌మైన మార్పుకు కార‌ణ‌మైన మ‌రో అమ్మాయి నైనాలకు, క‌థ‌కు సంబంధ‌మేంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:
త‌న పాత్ర‌కు త‌నీశ్ వంద శాతం న్యాయం చేశాడు. శివ పాత్రలో తనీష్ నటన మెప్పిస్తుంది. ఎమోషనల్ కిల్లర్ క్యారెక్టర్ కు తనీష్ తన నటనతో న్యాయం చేశాడు. ఇక హీరోని ఇష్టపడే సరదా అమ్మాయిగా ముస్కాన్ సేథి తనదైన నటన, అందంతో ఆకట్టుకుంది. నైని పాత్రలో అర్చనా సింగ్ పర్వాలేదనిపించింది. రాణె భాయ్ గా కబీర్ సింగ్ దుహాన్ సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు. ఇక ముస్కాన్ సేథి పాత్ర‌కు అంత ప్రాధాన్యం లేదు. ఇక భాను శ్రీ పాత్ర కూడా అతిథి పాత్రగానే క‌నిపించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఇక రాణే పాత్ర‌లో క‌బీర్ త‌న‌దైన స్టైల్లో విల‌నిజాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేశాడు.  మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
ఇక సాంకేతికంగా చూస్తే, డైరెక్ట‌ర్ జానీ రొటీన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ త‌ర‌హాలో మ‌రో ప్ర‌స్థానంను తెర‌కెక్కించ‌లేదు. ఓ రాత్రిలో జ‌రిగే క‌థ‌ను సింగిల్ షాట్‌లో చిత్రీక‌రించాల‌నుకున్న ఆలోచ‌న బావుంది. అందుకు త‌గ్గ‌ట్లు స‌న్నివేశాల‌ను ప్లాన్ చేసుకుని సినిమాను చిత్రీక‌రిస్తూ వ‌చ్చారు. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ చేసిన పాట‌లు క‌థ‌లో స్పీడుకు బ్రేకులేసేలా ఉన్నాయి. నేప‌థ్య సంగీతం ప‌ర్లేదు. ఇక సింగిల్ షాట్‌లో సినిమాను చిత్రీక‌రించ‌డంలో డైరెక్ట‌ర్ జానీకి సినిమాటోగ్రాఫ‌ర్ ఎం.ఎన్‌.బాల్ రెడ్డి చక్క‌గానే స‌పోర్ట్ చేశాడు. ఎందుకంటే వీరిద్ద‌రూ యూనిట్‌తో క‌లిసి చేసిన ప్లానింగ్ కార‌ణంగానే సినిమా చ‌క్క‌గా ముందుకు సాగింది. అయితే సినిమాలో క్వాలిటీ క‌నిపించ‌దు. సింగిల్ షాట్ మూవీ కావ‌డం, రీటేక్స్ తీసుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో టెక్నిక‌ల్‌గా ఈ విష‌యంలో ఎవ‌రినీ త‌ప్పు ప‌ట్ట‌లేం. క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. సినిమాలో కొన్ని సీన్స్ మ‌రి సాంకేతికంగా ఆక‌ట్టుకోవు.

విశ్లేష‌ణ‌:
మ‌నం చేసే త‌ప్పులు వ‌ల్ల ఇత‌రులు బాధ ప‌డుతుంటారు. ఆ బాధ‌ను మ‌నం గ్ర‌హించ‌లేనంత కాలం మ‌న‌కు ఏమీ కాదు. అదే మ‌నం చేసే త‌ప్పులు మ‌న‌ల్ని మ‌రో రూపంలో బాధ పెడితే, ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం.  ఎక్కువ భాగం యాక్ష‌న్‌కే చుట్టూనే ర‌న్ అవుతుంది.  సింగిల్ షాట్ మూవీ కాబ‌ట్టి న‌టీన‌టులు త‌మ త‌మ పాత్ర‌ల‌ను ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. మరో ప్రస్థానం మూవీ మేకింగ్ పరంగా ఇన్నోవేటివ్ ప్రయత్నమే అని చెప్పాలి. రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. దర్శకుడు అనుకున్న పాయింట్‌ కొత్తగా ఉన్నప్పటికీ, అనుకున్నట్లు తెరపై చూపిండంతో కాస్త తడబడ్డాడు. అయితే ఓ రాత్రిలో జ‌రిగే క‌థ‌ను సింగిల్ షాట్‌లో చిత్రీక‌రించాల‌నుకున్న దర్శకుడి ఆలోచ‌న మాత్రం బాగుంది. అందుకు త‌గ్గ‌ట్లు స‌న్నివేశాల‌ను ప్లాన్ చేసుకుని సినిమాను చిత్రీక‌రిస్తూ వ‌చ్చారు. వన్ షాట్ ఫిల్మ్ మేకింగ్ లో కొన్ని చోట్ల సీన్స్ ల్యాగ్ అనిపించవచ్చు. కానీ తన డెసిషన్ కు కట్టుబడి ఫిల్మ్ చేశాడు.

ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినా.. ఇంటర్వెల్‌ టిస్ట్‌ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్‌ కూడా రోటీన్‌గా సాగడం కాస్త మైనస్‌. సునీల్ క‌శ్య‌ప్ పాటలు కథలో స్పీడుకు బ్రేకులు వేసేలా ఉంటాయి. కానీ నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అంతంత మాత్రంగానే ఉంది.  సింగిల్ షాట్ మూవీ కావ‌డం, రీటేక్స్ తీసుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో టెక్నిక‌ల్‌గా ఈ విష‌యంలో ఎవ‌రినీ త‌ప్పు ప‌ట్ట‌లేం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కొద్దిగా ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసి ఉంటే మరో ప్రస్థానంలో మరింత రిలీఫ్ దొరికేది. మొత్తంగా సింగిల్ షాట్‌లో తీసిన మరో ప్రస్థానం టాలీవుడ్‌లో ఒక కొత్త ప్రయత్నమనే చెప్పాలి.

 

Tags :