తుపాకీ నియంత్రణపై అమెరికా చట్టసభలో బిల్లు!

తుపాకీ నియంత్రణపై అమెరికా చట్టసభలో బిల్లు!

అమెరికాలో తరచూ తుపాకులతో కాల్పుల ఘటనలు జరుగుతుండడంతో ఆయుధాలను నియంత్రించే బిల్లును దిగువ సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనిపై సభకు చెందిన జ్యుడీషియరీ, కమిటీ వివిధ వర్గాల వాదనల్ని ఆలకించనుంది. సెమీ ఆటోమేటిక్‌ ఆయుధాలు కొనుగోలు చేయడానికి వయో పరిమితిని 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలనేది ఒక ప్రతిపాదన. ఆయుధాలను దిగుమతి చేసుకోవడం వాటి తయారీ, పెద్దఎత్తున తూటాలు కలిగి ఉండడం వంటివాటిని నేరాలుగా పరిగణించనున్నారు. దీనిపై వచ్చేవారం ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది.

 

Tags :