MKOne TeluguTimes-Youtube-Channel

జాయింట్ వెంచర్ ప్రకటించిన మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ & శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్స్

జాయింట్ వెంచర్ ప్రకటించిన  మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ & శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్స్

హైదరాబాద్‌లోని మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ మరియు హైదరాబాద్‌ లోని వనస్థలిపురంలోని ప్రఖ్యాత నేత్ర సంరక్షణ ఆసుపత్రి శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్స్ కలసి హైదరాబాద్ ప్రజలకు నాణ్యమైన కంటి సంరక్షణను అందించేందుకు, ఆ కార్యాచరణను బలోపేతం చేయడానికి జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్‌లలో విస్తరించి ఉన్న 35 ఆసుపత్రులతో మాక్సివిజన్ కంటి సం రక్షణలో అగ్రగామిగా ఎదుగుతోంది. ఏప్రిల్ 2023 నుండి ఈ గ్రూప్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్రలోని మరో 35 ఆసుపత్రులకు విస్తరిస్తోంది. ఈ విస్తరణలు ఆర్గానిక్ గ్రీన్ ఫీల్డ్ గా,  ఈ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆసుపత్రులతో కూడిన జాయింట్ వెంచర్‌ల మిశ్రమంగా ఉంటాయి. మార్చి 2024 చివరి నాటికి ఈ  ఆసుపత్రులతో మాక్సివిజన్  భారతదేశంలోని టాప్ 3 అతిపెద్ద కంటి సంరక్షణ గొలు సు ఆసుపత్రులలో ఒకటిగా నిలిచింది.

హైదరాబాదులోని ప్రముఖ నేత్ర వైద్యుడు డా.సుబ్బారావుకోటిపల్లి నేతృత్వంలోని శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్స్, వనస్థలిపురంలో గత 33 సంవత్సరాల నుండి సూపర్ స్పెషాలిటీ కంటి సంరక్షణ అందిస్తోంది.  ఈ కేంద్రం ఈ హెచ్ఎస్, ఆరోగ్యశ్రీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ఎంప్యానెల్ చేయబడింది. గత 3 దశాబ్దాల నుం డి లక్షలాది మంది రోగులకు కంటిశుక్లం, ఇతర కంటి వ్యాధులకు చికిత్స చేసింది. వనస్థలిపురంలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఈ కేంద్రం వనస్థలిపురం, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట ప్రాంతాలతో పాటుగా  చుట్టుపక్కల ఉన్న చాలా మంది ప్రజలకు కూడా తన సేవలను అందిస్తోంది.

అత్యాధునిక సాంకేతికతతో అత్యుత్తమ నేత్ర సంరక్షణ సేవల్లో పేరుగాంచిన, అన్ని స్పెషాలిటీలలో అత్యంత అనుభవజ్ఞులైన సర్జన్‌లను కలిగిన  మాక్సివిజన్‌తో ఈ భాగస్వామ్యం సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. అధు నాతన కంటి సంరక్షణ సాంకేతికతలలో పెట్టుబడిని అందిస్తుంది. దాంతోపాటుగా అన్నిరకాల కంటి  సమస్యల కు సంబంధించి గ్రూప్ నకు చెందిన సూపర్ స్పెషాలిటీ సర్జన్‌లను కూడా ఈ కేంద్రానికి తీసుకువస్తుంది.   ఈ జాయింట్ వెంచర్‌  మ్యాక్సివిజన్ శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్స్ గా వ్యవహరించబడనుంది.

ఈ సందర్భంగా మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రుల వ్యవస్థాపకులు, సహ చైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, "నేను 1996వ సంవత్సరంలో యూకేలో ముమ్మరంగా సాగుతున్న నా ప్రాక్టీస్ వ దులుకొని, కంటి సంరక్షణలో ప్రపంచంలోనే అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతికత భారతదేశ ప్రజలకు లభించేలా, దేశంలో ఒక పెద్ద కంటి సంరక్షణ చెయిన్ ను రూపొందించాలనే లక్ష్యంతో భారతదేశానికి తిరిగి వ చ్చాను. ఈ ఆశయంతోనే 1996లో భారతదేశానికి లాసిక్ లేజర్ సాంకేతికతను పరిచయం చేసిన మొదటి వ్య క్తిని నేను మాత్రమే. ఒక గ్రూప్ గా మా దృష్టి ఉత్తమ సాంకేతికతతో, ఉత్తమ వైద్యులతో కూడిన నేత్ర వైద్యశాల ల నెట్‌వర్క్‌ ను సృష్టించడం, తద్వారా వృద్ధి లోకి వస్తున్న నేత్ర వైద్య నిపుణులు తమ నైపుణ్యాలను మెరు గుపరుచుకోవడానికి, అత్యుత్తమ సాంకేతికతలను తెలుసుకునేందుకు వీలుగా ఒక వేదికను సృష్టించడం. మా నైతిక అభ్యాసాల సూత్రాలు, మంచి నాణ్యమైన చికిత్స అనేవి మా గ్రూప్ ఇప్పుడు 35 ఆసుపత్రులకు ఎదగ డానికి సహాయపడింది. ఒక సంవత్సరంలో 6 ఇతర రాష్ట్రాలకు బ్రాండ్ వృద్ధిని చూస్తున్నందుకు నేను గర్వప డుతున్నాను. డా.సుబ్బారావుతో నా అనుబంధం, వ్యక్తిగతంగా, డాక్టర్ స్థాయిలో 25 సంవత్సరాల నాటిది. ఆయన హైదరాబాద్‌లోని అత్యుత్తమ సర్జన్‌లో ఒకరు.  గత 33 సంవత్సరాల నుండి తన రోగులందరికీ నైతిక విలువలతో, సానుభూతితో కూడిన సేవలు అందించడంలో గొప్ప పేరు కలిగి ఉన్నారు. ఇలాంటి దృక్పథంతో ఈ ప్రయాణంలో మనం ఇప్పుడు కలిసి ఉన్నందుకు నేను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.

డా.జి.ఎస్.కె. వేలు మాట్లాడుతూ, ‘‘మాక్సివిజన్ సరసమైన ధరలతో, దేశవ్యాప్తంగా అద్భుతమైన వైద్యుల ద్వా రా నాణ్యమైన కంటి సంరక్షణను అందించే తాత్వికతపై నిర్మించబడింది. మేం ఇప్పటివరకు 35 ఆసుపత్రుల తో, 4 రాష్ట్రాల్లో మాతో పని చేస్తున్న 200+ అనుభవజ్ఞులైన వైద్యులతో విజయవంతంగా నిలిచాం. మా విస్తరణ ప్రణాళికలలో భాగంగా మంచి సాంకేతికత, చక్కటి మౌలిక సదుపాయాల ఆసుపత్రులలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాం. వచ్చే ఏడాది 6 రాష్ట్రాలలో 40+ ఆసుపత్రులను కలిగిఉండేందుకు సుమారు రూ.500 కోట్ల పెట్టు బడి పెట్టాలని  యోచిస్తున్నాం. సేవల నాణ్యత, మౌలిక సదుపాయాలు, ఉత్తమ వైద్యుల బృందం ప రంగా దేశంలోనే అతిపెద్ద కంటి సంరక్షణ గొలుసుగా మారడంపైనే మా దృష్టి ఉంది. నేను డాక్టర్ సుబ్బారావు గారిని మా బృందంలోకి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. రోగి సంరక్షణ పట్ల సహృదయత కలిగి, అచంచల మైన శ్రద్ధతో పని చేసేటటువంటి సమర్థులైన, పేరున్న డాక్టర్‌ని మా వృద్ధి ప్రయాణంలో కలిగి ఉండటం మాకు చక్కటి బహుమతి’’ అని అన్నారు.

ఈ సందర్భంగా గ్రూప్ సీఈఓ సుధీర్ మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్ మా బ్రాండ్ కు పుట్టినిల్లు. గత 28 ఏళ్లుగా మా ప్రియతమ వ్యవస్థాపకుడు డాక్టర్ కాసుప్రసాద్ రెడ్డి నాయకత్వంలో, ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ టీమ్‌ అం డగా, ప్రముఖ వైద్యుల బృందంతో కలిసి పనిచేస్తున్నాం. గత 3 దశాబ్దాలుగా, హైదరాబాద్ నగరంలో నాణ్యమై న నేత్ర సంరక్షణలో మొదటి ఎంపికగా మేం ఉండే స్థితిని సాధించగలిగాం. గత 3 దశాబ్దాలలో మా వద్ద చికిత్స పొందిన మా 6 మిలియన్ల మంది రోగులందరూ మా నైతిక సేవలతో చాలా సంతోషంగా ఉన్నారు.  మేం సరస మైన ధరలతో నైతికపరంగా, నాణ్యమైన కంటి సంరక్షణ సేవా ప్రదాతగా ఈ స్థానాన్ని కొనసాగిస్తాం’’ అని అన్నా రు.
మా విస్తరణ ప్రణాళికలో మేం విశ్వసనీయ నేత్ర సంరక్షణ సేవా ప్రదాతగా రోగి మొదటి ఎంపికగా మారడానికి గాను, విలువలపై రూపుదిద్దుకున్న వ్యవస్థలు, సేవల నాణ్యతను మరింత ముందుకు తీసుకువెళతాం. దేశం లో అతి పెద్ద ఐ కేర్ చెయిన్‌ను రూపొందించాలనే మా ఆశయం అంతా కూడా వృత్తిపరంగా మాతో నిమగ్నమై ఉండే మా వైద్యులపై మరియు మేం విస్తరించే ప్రతి నగరం, జిల్లా,  రాష్ట్రంలోని ప్రముఖ సర్జన్ల భాగస్వా మ్యంతో  నిర్మించబడింది. జాయింట్ వెంచర్ మోడల్‌తో, మేం అదనపు కేంద్రాలను సృష్టించడమే కాకుండా, విలువైన క్లినికల్ లీడర్‌షిప్‌ను కూడా మా ప్రయాణంలోకి తీసుకువస్తాం. వరంగల్‌లో డాక్టర్ శరత్ బాబు, నర్సరావుపేట లో డాక్టర్ రామలింగారెడ్డి, తమిళనాడులో డాక్టర్ శిబువర్కీ, రాజ్‌కోట్‌లో డాక్టర్ సపోవాడియా, సూరత్ లో డా క్టర్ ఆర్.కె.సచ్‌దేవా వంటి దశాబ్దాల ఖ్యాతి గడించిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు నేడు మాతో కలసి ఉన్నా రు. ఇంకా చాలా మంది ఏప్రిల్ నుండి మాతో కలసి పయనించనున్నారు. డా.సుబ్బారావు, మా క్లినికల్ లీడర్‌ షిప్ టీమ్‌కి గొప్ప విలువను జోడిస్తారు. మా మొత్తం గ్రూప్ తరపున, నేను ఆయనను మాతో కలసి పయనిం చేందుకు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను’’ అని అన్నారు.

రాబోయే నెలల్లో, మా శిక్షణ పొందిన నిపుణులు, ఈ సెంటర్‌లో సేవల నాణ్యతను మెరుగుపరుస్తారు. ఈ సెంట ర్‌కు సరికొత్త సాంకేతికతలను కూడా తీసుకువస్తారు. గ్రూప్ లోని మా అనుభవజ్ఞులైన సూపర్ స్పెషలిస్ట్‌ లు కూడా ఈ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ క్లినిక్‌లను సంతోషంగా నిర్వహిస్తారు. ఈ రోజు, మేం ఈ కేంద్రంలో హై టె క్నాలజీ, లేజర్ సూట్‌ను కూడా ప్రారంభిస్తున్నాం. జాయింట్ బ్రాండ్ ఎంటిటీ ఈ సంస్థను ఈ ప్రాంతంలోని ఉత్తమ కంటి సంరక్షణ ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తుంది.

శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, ప్రస్తుత మాక్సివిజన్ శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డా.సుబ్బారావు కోటిపల్లి మాట్లాడుతూ, ‘‘నేను గత 33 సంవత్సరాల నుండి కంటి సర్జన్‌ల చిన్న బృందంతో దీన్ని నిర్వహిస్తున్నాను. హైదరాబాద్ రోగులు ఇప్పుడు తమ కంటి సంరక్షణ అవసరాలకు ఉత్తమమైన ప్రదేశం ఏది, ఉత్తమ నాణ్యమైన దృష్టి కోసం ఉత్తమ, సురక్షిత సాంకేతికత ఏది లాంటి అంశాలపై బాగా అవగాహన కలిగి ఉన్నారు. నేను చాలా టెక్నాలజీలలో ఇన్వెస్ట్ చేసాను, కానీ టెక్నాలజీని మెరుగు ప రుచుకోవడానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. గత దశాబ్దం నుండి దేశంలో ఎక్కువ మంది సర్జన్లతో పాటుగా సూపర్ స్పెషాలిటీ నైపుణ్యాలు అందుబాటులో ఉన్నాయి. అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు, సర్జన్లతో కంటి సంరక్షణలో అత్యుత్తమ సాంకేతికతను కలిగి ఉన్న గ్రూప్ గా మాక్సివిజన్ గొప్ప ఖ్యాతిని కలిగి ఉంది. ఈ జా యింట్ వెంచర్‌తో, మేము మాక్సివిజన్ సాంకేతికత, నైపుణ్యాలను పొందగలుగుతాం. తమ  కంటి సంరక్షణ అవసరాల కోసం గత 3 తరాల నుండి నా వద్దకు వస్తున్న రోగులకు వాటిని అందజేస్తాము. కంటి సంరక్షణలో అత్యుత్తమ సేవలను అందించేందుకు  మాక్సివిజన్, నా గౌరవనీయ సహచరుడు డా.కాసు ప్రసాద్ రెడ్డితో కలిసి పని చేయడం ఆనందదాయకం. నేను ఈ కేంద్రంలో రోగులను ఆపరేట్ చేయడం, చూడటం కొన సాగి స్తాను. నా రోగులందరికీ ఈ గ్రూప్ లో అందుబాటులో ఉన్న అన్ని అత్యుత్తమ సాంకేతికతలను అందిస్తాను’’ అని అన్నారు.

మాక్సివిజన్ శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్స్ లో వైద్యుల బృందం

డా. కె. సుబ్బారావు-(ఆఫ్తాల్మిక్ సర్జన్)
డాక్టర్ జి. లత - (కన్సల్టెంట్  ఆప్తమాలజిస్ట్)
డా. సుబాష్.టి- (కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్)
డా. మురళీ మోహన్ గుర్రం- (విట్రియో రెటినాల్ సర్జన్)

విజిటింగ్ కన్సల్టెంట్స్

డాక్టర్ బాల్కీసత్యప్రసాద్ (సీనియర్ కాటరాక్ట్, కార్నియా, రిఫ్రాక్టివ్ సర్జన్)
డాక్టర్ శ్రీదేవి వేణుగోపాల్ – (సీనియర్ పీడియాట్రిక్ ఆప్తాల్మాలజిస్ట్)
డా.సుచరిత- (సీనియర్ ఓక్యులోప్లాస్టీ సర్జన్)
 
మాక్సివిజన్ శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న సాంకేతికతలు

కాన్స్టెలేషన్ మెషిన్- విట్రియో రెటినా సర్జికల్ యూనిట్
కేటలిస్ మెషిన్ - ఫెమ్టోసెకండ్ లేజర్ రోబోటిక్ కాటరాక్ట్ సర్జరీస్
లాసిక్ సూట్ – అద్దాలను తొలగించడానికి B & L రిఫ్రాక్టివ్ లేజర్
స్టెల్లారిస్ - ఫాకో మెషిన్
సిగ్నేచర్ ప్రో - ఫాకో మెషిన్
విసు మాక్స్ - స్మైల్ మెషిన్

మాక్సివిజన్ శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న సేవలు
•    కంటి శుక్లాలు
•    రిఫ్రాక్టివ్ ఎర్రర్స్
•    గ్లాకోమా
•    పీడియాట్రిక్ ఐ కేర్
•    లాసిక్
•    రెటీనా
•    కార్నియా
•    ఓక్యులోప్లాస్టీ
•    స్మైల్

 

 

Tags :