ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించిన మాయావతి

ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించిన మాయావతి

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ బహుజన సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మద్దతు ప్రకటించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాయావతి మద్దతు ప్రకటన ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ మాట్లాడుతూ బెహెన్‌ జీ ఎల్లప్పుడు అణగారిన వర్గాలకు సంబంధించిన గళాన్ని లేవనెత్తారని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అధికార, విపక్షాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 6న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్‌ జరుగనున్నది.

 

Tags :