బీఎస్‌పీ అధినేత్రి మాయవతి కీలక వ్యాఖ్యలు

బీఎస్‌పీ అధినేత్రి మాయవతి కీలక వ్యాఖ్యలు

జైలు జీవితం గడుపుతున్న ఎస్‌పీ నేత ఆజం ఖాన్‌ ఆ పార్టీని వీడతారనే ప్రచారం సాగుతున్న క్రమంలో ఆయనకు మద్దతుగా బీఎస్‌పీ అధినేత్రి మాయవతి కీలక వ్యాఖ్యలు చేశారు.యోగి ఆదిత్యానాధ్‌ నేతృత్వంలోని యూపీ బీజేపీ సర్కార్‌ ముస్లింలను వేధిస్తోందని అన్నారు. యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను వేధిస్తున్నారని, వారు పాలకుల ఆగడాలకు బాధితులుగా బలవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల పట్ల ద్వేషభావంతో అణిచివేత చర్యలకు పాల్పడుతోందని సీనియర్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజం ఖాన్‌ను రెండున్నరేండ్ల నుంచి జైలులో నిర్బంధించారని ఆమె ఆందోళన చెందారు.

 

Tags :