విపక్ష కూటమికి షాక్.. ద్రౌపదీ ముర్ముకే

విపక్ష కూటమికి షాక్.. ద్రౌపదీ ముర్ముకే

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ చీఫ్‌ మాయవతి మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపదికి ఓట్లు వేస్తారని తెలిపారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయించాం. తాము బీజేపీకి గానీ, ఎన్డీయేకి గానీ మద్దతు ఇవ్వడం లేదు. అలాగని ప్రతిపక్షాలకూ వ్యతిరేకం కాదు. పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం అని మాయావతి తెaలిపారు. మద్దతు అంశంపై ప్రతిపక్షలు తమను సంప్రదించ లేదని వెల్లడించారు.

 

Tags :