సంచలన ప్రకటన.. మాయావతి ఎన్నికల్లో

సంచలన ప్రకటన.. మాయావతి ఎన్నికల్లో

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి మాయావతి పోటీ చేయడం లేదు. ఆ పార్టీ ఎంపీ సతీష్‌ చంద్ర మిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో  మాట్లాడుతూ తాను సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. సమాజ్‌వాదీ పార్టీకి 400 మంది అభ్యర్థులు లేకపోతే వాళ్లు  (ప్రధాన పార్టీలు) ఎలా 400 సీట్లు గెలుస్తారు? అని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ కానీ, బీజేపీ కానీ అధికారంలోకి రాబోవడం లేదు. యూపీలో ప్రభుత్వాన్ని బీఎస్‌పీ ఏర్పాటు చేస్తుంది అని అన్నారు. దీనికి ముందు కూడా మాయావతి కావాల్సినంత చురుకుగా ఉన్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రకటించారు.

 

Tags :