100 ఏళ్లలో ఇదే మొదటిసారి... అమెరికాలో

మధ్యంతర ఎన్నికల తరవాత అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభలో ప్రతిపక్షం రిపబ్లికన్ పార్టీకి స్వల్ప మెజారిటీ లభించినా, తమ నాయకుడు కెవిన్ మెకార్థీని సభా స్పీకర్‌గా ఎన్నికోవడానికి ఆ పార్టీ నేతలు రెండు రోజుల నుంచి తంటాలు పడుతున్నారు. దాదాపు 20 మంది రిపబ్లికన్ సభ్యలు మెజార్టీ అభ్యర్థిత్వాన్ని సమర్థించడానికి నిరాకరిస్తుండటంతో స్పీకర్‌గా ఎన్నిక కావడానికి కావలసిన 218 ఓట్లను ఆయన పొందలేకపోతున్నారు. సమస్య నుంచి గట్టెక్కడానికి రిపబ్లికన్లు వరుసగా రెండు రోజుల నుంచి ఓటింగ్ మీద ఓటింగ్ జరుపుతూ వస్తున్నార. మొత్తం ఆరుసార్లు ఓటింగ్ జరిగినా మెకార్థీ 218 ఓట్లు సంపాదించలేకపోయారు. నిజానికి స్పీకర్ పదవికి మెకార్థీ అభ్యర్థిత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. అయితే సభలో ఆయన అనుయాయులు మాత్రం మెకార్థీ ఎన్నికకలు ససేమిరా అంటున్నారు. అమెరికాలో తొలి ఓటింగ్‌లోనే స్పీకర్ ఎన్నిక ఖరారు కాకపోవడమనేది 100 ఏళ్లలో ఇదే మొదటిసారి.