ఉక్రెయిన్ గెలిచేవరకు మద్దతు : అమెరికా

ఉక్రెయిన్ గెలిచేవరకు మద్దతు  : అమెరికా

అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్‌ నేత మిచ్‌ మెకొనెల్‌తో పాటు పలువురు రిపబ్లికన్‌ సెనేటర్లు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఆకస్మిక పర్యటన జరిపారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు.  ఉక్రెయిన్‌ గెలిచేవరకు మద్దతు కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్‌కు 4000 కోట్ల డాలర్ల ప్యాకేజీకి వచ్చే వారం అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం లభించే అవకాశముందని సమాచారం. మరోవైపు యూరోవిజన్‌ సంగీత కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో జరుపుతామని జెలెన్‌స్కీ ప్రకటించారు. కుదిరితే మారియుపోల్‌లో నిర్వహిస్తామన్నారు.

 

Tags :