ఫిబ్రవరి 16 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర

ఫిబ్రవరి 16 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర

తెలంగాణ కుంభమేళాగా, ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన వనదేవతల జాతరకు సర్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేయగా, సమ్మక్క సారలమ్మ మహా జాతర 2022 తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనుంది. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహా జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా వస్తారు. కోవిడ్‌ మొదలైన తర్వాత మొదటిసారి జాతర జరుగుతుండటంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులు చివరి దశలో ఉండగా జాతర పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లను విడుదల చేసింది.

 

Tags :