ఎపిలో ‘మౌలిక’ ప్రాజెక్టులపై ప్రణాళిక అవసరం

మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు సంబంధించి 2022-23 ఆర్థిక ఏడాదికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై మంత్రి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఎయిర్‌పోర్టులు, పోర్టుల ప్రగతి, విశాఖ-చెన్నై కారిడార్ పురోగతిపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. ఫిబ్రవరి 4వ తేదీకల్లా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈడీబీ, ఎంఎస్‌ఎంఈ, ఏపీఐఐసీ, మారిటైమ్ బోర్డు తదితర అన్ని విభాగాలను పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌లో లింక్ ద్వారా ఓపెన్ చేసేందుకు వీలుగా వెబ్‌సైట్ విండో తయారు చేయాలని మంత్రి సూచించారు. లేపాక్షి, హస్తకళలు కలిపి జాయింట్ ఔట్‌లెట్లు ఏర్పాటు చేసి చేనేత, జౌళి, హస్తకళలను ప్రజలకు మరింత చేరువ చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.
Tags :