MKOne Telugu Times Youtube Channel

ఇది జిల్లాకే గర్వకారణం : మేకపాటి

ఇది జిల్లాకే గర్వకారణం : మేకపాటి

దేశంలోనే అతిపెద్ద యుద్ధ నౌకకు ఉదయగిరి పేరును పెట్టడడం చాలా సంతోషంగా ఉందని, ఇది జిల్లాకే గర్వకారణంగా ఉందని మాజీ పార్లమెంట్‌ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. ఉదయగిరి ప్రత్యేక గుర్తింపునిచ్చిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆత్మనిర్బర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్దు నౌకలను కేంద్ర మంత్రి ముంబైలో ప్రారంభించారన్నారు. ఇందులో ఒకదానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేని పేరు పెట్టడం హర్షణీయమన్నారు. ఉదయగిరిలోని అతిపెద్ద పర్వతాలను పరిగణనలోకి తీసుకుని యుద్ధ నౌకకు ఆ పేరు పెట్టడం మంచి పరిణామమని కొనియాడారు.

 

Tags :