పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు.. మారితే ఇంటికే

పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వదంతులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ నేను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. పార్టీ మారితే నేను ఇంటికే పరిమితమవుతాను. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటాను. ఎక్కడి టికెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీ చేస్తాను. ఎవరు తప్పు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందిస్తున్న పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ. విద్యావ్యసవ్థలో మార్పులు తీసుకువచ్చి, సీఎం జగనన్న ప్రభుత్వం అందరికీ విద్య అందిస్తోంది. ప్రజల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు ఉంది. గడప గడపకు వెళ్తే ప్రజలు ఎంతో ఆనందంతో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు అని అన్నారు.