158 ఏళ్ల తరువాత ఇప్పుడే... ఈ నెల 23 నుంచే

158 ఏళ్ల తరువాత ఇప్పుడే... ఈ నెల 23 నుంచే

సౌర కుటుంబంలో భూమి సహా ఎనిమిది గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. వాటిలో ఐదు గ్రహాలు ఒక వరుసలో కనిపించే అరుదైన ఘట్టానికి ఈ నెల వేదిక అవుతోంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకదాని  వెనుక మరొకటిగా కనువిందు చేయనున్నాయి. ఈ నెల 23 నుంచే ఈ  వరుస క్రమం ప్రారంభమైందని, 26, 27 తేదీల్లో అద్భుతంగా కనిపిస్తుందని అంతరిక్ష నిపుణులు చెపుతున్నారు. ఈ రోజుల్లో తెల్లవారు జామున సూర్యోదయానికి ముందు తూర్పు దిశ నుంచి నైరుతి దిశ వరకు వరుసగా ఈ గ్రహాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు. అయితే భూమిపై వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో కాస్త ముందు, తరువాత ఆ దృశ్యం కనిపిస్తుందని చెపుతున్నారు.

 

Tags :