అమెరికాలో ఎంబీబీఎస్ కు... మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్

అమెరికాలో ఎంబీబీఎస్ కు... మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్

అమెరికాలో ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసించాలనుకునే భారతదేశ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ టెస్టును నిర్వహించనున్నట్లు సెంట్రల్‌ అమెరికా, సెయింట్‌ లూసియాలోని స్పార్టన్‌ హెల్త్‌ యూనివర్సిటీ  ఓ ప్రకటనలో తెలిపింది. మెరిట్‌ ఆధారంగా 100 శాతం స్కాలర్‌షిప్‌ను ఇచ్చే అవకాశాలున్నాయని యూనివర్సిటీ ఇండియా హెడ్‌ సతీష్‌ గరికపాటి తెలిపారు. ఈ నెల 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుందని, విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఫీజులో రాయితీ ఉంటుందని వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు 77999 22859 ఫోన్‌  నెంబర్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా పేరు, నీట్‌లో వచ్చిన మార్కులు ఇతర వివరాలను పంపి  నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంబీబీఎస్‌ కోర్సు చదవాలనుకునేవారు దీని ద్వారా తమ కలను నిజం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

 

Tags :