వైట్ హౌస్ ను వీడుతుంటే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యా : మిషెల్

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, శ్వేత సౌధాన్ని వీడే ముందు తట్టుకోలేకపోయానని మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా వెల్లడించారు. అరగంటపాటు ఏడుస్తూనే ఉన్నానని, ఉద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయానని తెలిపారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత తీవ్ర ఉద్వేగానికి గురయ్యా. 8 సంవత్సరాలు ఉన్న ఇంటిని మేం వీడుతున్నాం. నా పిల్లలకు శ్వేత సౌధంతో అనుబంధం ఎక్కువ. వారికి షికాగో గుర్తుంది. కానీ నా పిల్లలు ఎదిగింది ఇక్కడే. వారిని పెంచడంలో ఇక్కడి సిబ్బంది ఎంతో సహకరించారు. దాంతో ఆ ఇంటితో మా బంధం పెనవేసుకోపోయింది అని ఆనాటి అనుభవాలను మిషెల్ ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఆ కార్యక్రమం తర్వాత మేం అక్కడి నుంచి వెళ్లిపోయాం. ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కాం. విమానం తలుపులు మూయగానే నన్ను నేను నియంత్రించుకోలేకపోయా. 30 నిమిషాలు ఏడుస్తూనే ఉన్నా అని తెలిపారు.