డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చిన మైక్ పెన్స్

అమెరికాలో 2020 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారనే ఆరోపణలపై గ్రాండ్ జ్యూరీ విచారణ కొత్తమలుపు తిరగనుంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని నాటి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ 2021 జనవరి 6న కాంగ్రెస్ ( పార్లమెంటు)లో ప్రకటించనుండగా, ట్రంప్ అనుయాయులు కాంగ్రెస్ భవనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పెన్స్ వాంగ్మూలాన్ని అడ్డుకోవడానికి ట్రంప్ వర్గం ప్రయత్నిస్తున్నా, వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఓ దిగువ కోర్టు పెన్స్‌ను ఆదేశించింది. ఆపైన అమెరికా అప్పీల్స్ కోర్టు త్రిసభ ధర్మాసనం తన ఉత్తర్వును సీల్డ్ కవరులో అందించింది. అందులో ఎవరి పేర్లు ఉన్నాయో ఆన్‌లైన్ కోర్టు రికార్డుల్లో వెల్లడించలేదు. పెన్‌స ఏ తేదీన గ్రాండ్ జ్యూరీ ముందు హాజరై సాక్ష్యం చెప్పేదీ ఇంకా తెలియరాలేదు.
Tags :