తక్కువ అంచనా వేయొద్దు : భారత సైంటిస్ట్ రవీంద్ర గుప్తా

తక్కువ అంచనా వేయొద్దు : భారత సైంటిస్ట్ రవీంద్ర గుప్తా

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ వేరియెంట్‌ను తక్కువ అంచనా వేయొద్దని భారత సంతతి సైంటిస్ట్‌ రవీంద్ర గుప్తా తెలిపారు. కేంబ్రిడ్జ్‌ వర్సిటీలో క్లినికల్‌ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన ఒమిక్రాన్‌ వేరియంట్‌పై బ్రిటన్‌లో అధ్యయన బృందానికి నేతృత్వం వహించారు. బ్రిటన్‌లో కరోనా కొత్త కేసులు, మూడోవేవ్‌కు కారణం ఒమిక్రాన్‌. ఇది రోగి ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తోందని అక్కడి వైద్యులు గుర్తించారు. వైరస్‌ తన స్వరూపం మార్చుకొని క్రమ క్రమంగా బలహీనపడుతోంది అనే భావనతో ఉన్నాం. అది తప్పు సార్స్‌ కోవ్‌ 2ను కోవిడ్‌ 19గా పేర్కొంటాం. ఇది ఎంత వేగంగా విస్తరిస్తున్నది. అన్నడి ఇక్కడ ముఖ్యం కాదు. వైరస్‌ బలహీనపడుతోంది. అనడానికి శాస్త్రీయ ఆధారాలు కనపడటం లేదు. వైరస్‌ తన స్వరూపాన్ని మార్చుకుంటూ వెళ్తోంది అని రవీంద్ర గుప్తా తెలిపారు.

 

Tags :