పాఠశాలల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలి- సురేష్

పాఠశాలల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలి- సురేష్

పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్‍ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్‍ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‍ ఆదిమూలపు సురేష్‍ అధికారులను ఆదేశించారు. ఆగష్టు 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సెప్టెంబర్‍ ఒకటో తేదీ నుంచి కళాశాలలు ప్రారంభించిన తరువాత మంత్రి పరిస్థితులపై సమీక్షించారు. విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.  కరోనా పరిస్థితులతోపాటు ఇప్పటివరకు వాక్సిన్‍ వేయించుకున్న ఉపాధ్యాయుల వివరాలు, ప్రస్తుతం పాజిటివ్‍గా నమోదైన విద్యార్ధుల, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు కొనసాగించాలని సూచించారు.

 

Tags :