ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే.. ఏపీ నుంచి వెళ్లగొట్టినటా ? : మంత్రి అమర్నాథ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరైందని కాదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడవాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమలు వస్తే ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుందన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అమర్ రాజా ప్రతినిధులు ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చెందిన హెరిటెజ్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో ఉందన్న ఆయన చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అని అడిగారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమనూ రాజకీయ కోణంలో చూడలేదని అన్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో భారీ ఇన్వెస్మెంట్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం అని అన్నారు.
Tags :