ఉపాధ్యాయుల కోరిక మేరకే ... వారిని తప్పించాము : మంత్రి బొత్స

ఉపాధ్యాయుల కోరిక మేరకు వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిస్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సీఎం ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులే మాకు ఏ విధమైన విధులు ఉండకూడదు. బోధించడం తప్ప ఏ విధమైన కార్యక్రమాలు మాకు అప్పగించొద్దు అని రిక్వెస్ట్ చేశారు. దానిని పరిగణనలోకి తీసుకొనే ఉపాధ్యాయులకు మేం వెసులుబాటు కల్పించాం. నా నాయకుడు జగన్ చెప్పిన మాదిరి రాష్ట్రంలో చేసిందే చెప్తున్నాం. చేయబోయేది చెప్తున్నాం అని అన్నారు.
Tags :