పవన్ కల్యాణ్ కు అది సాధ్యమా? : ధర్మాన

పవన్ కల్యాణ్ కు అది సాధ్యమా? : ధర్మాన

ప్రజా జీవితం మాటలు చెప్పినంత సులువు కాదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని లింగాలవలసలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అధికారంతో సంబంధం లేకుండా 45 ఏళ్లు ప్రజాజీవితంలో ఉన్నానని తెలిపారు. సీఎం జగన్‌ మాటిచ్చిన నిలబెట్టుకున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వాన్ని గుర్తించాలే తప్ప సినిమా పోస్టర్ల మీద ఫోజులిఇచ్చిన ఫొటోలు దిగితే ప్రయోజనం ఉండదన్నారు. సినిమా వేరు, నిజజీవితం వేరు. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులుంటాయి. పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా నడుస్తానంటున్నారు అది సాధ్యమా? పవన్‌ను నాతో నడవమనండి. ఆయన రాజకీయాల్లో 3.కి.మీలు కూడా నాతో నడవలేరు. సినిమాలో బొమ్మలు పెట్టి యాక్షన్‌ చేస్తారు. నాకు 64 ఏళ్లు ఆయన నాతో నడవగలరా? ప్రజా జీవితం మాటలు చెప్పినంత సులువేం కాదు అని అన్నారు.

 

Tags :