దేశంలోనే ఏపీ మొదటి స్థానం : మంత్రి అమరనాథ్

దేశంలోనే ఏపీ మొదటి స్థానం : మంత్రి అమరనాథ్

దేశంలోనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానం సంపాదించడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఘనతే అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి నెంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం పట్ల సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమలకు సీఎం జగన్‌ చక్కని ప్రోత్సాహం ఇస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ అనుకూలంగా ఉందన్నారు. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్‌ ఇబ్బందులు పరిశ్రమలకు కలగకుండా సీఎం ఆదేశాలతో అధికారులు సహకరించారు.  టాప్‌ అచీవర్స్‌గా ఏపీ మొదటి స్థానం సంపాదించడం గర్వంగా ఉందని అని మంత్రి తెలిపారు.

 

Tags :