నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే... ఏ శిక్షకైనా సిద్ధం

బీజేపీ నేతలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసిరారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి సంబంధించి ఏపీ పునర్విభజన చట్టంలో ఎన్నో రకాల హామీలు, వాగ్దానాలు కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చింది. తెలంగాణకు సంబంధించినంత వరకు కచ్చితమైన, స్పష్టమైన వాగ్దానాలు చేసింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కొత్త విద్యా సంస్థలు ఇస్తామని, పారిశ్రామిక కారిడార్‌లు, రాయితీలు ఇస్తామని, ఇలా ఎన్నో రకాల వాగ్దానాలు పార్లమెంట్ సాక్షిగా చట్టంలో పొందుపరిచారు. సీట్ల సంఖ్య కూడా పెంచుతామని చెప్పారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.