రేవంత్ రెడ్డి చాలెంజ్ ను.. కేటీఆర్ స్వీకరించాలి

రేవంత్ రెడ్డి చాలెంజ్ ను.. కేటీఆర్ స్వీకరించాలి

టీఆర్‌ఎస్‌ పెట్టే కేసులు భయపడేది లేదని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి వైట్‌ చాలెంజ్‌ చేస్తే దానికి మంత్రి కేటీఆర్‌ పరువునష్టం కలిగిందని అనడం అవివేకమని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్‌ రెడ్డి విసిరిన డ్రగ్స్‌ ఫ్రీ చాలెంజ్‌ను కేటీఆర్‌ స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంలో ప్రజాప్రతినిధులు టెస్టులు చేయించుకుని ఆదర్శంగా నిలవాలని కోరారు. డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.  రాహుల్‌ గాంధీతో కేటీఆర్‌ పోల్చుకోవడం ఏమిటి? అన్నారు. కేటీఆర్‌కు, రాహుల్‌గాంధీకి భూమికి  ఆకాశానికి ఉన్న తేడా ఉందన్నారు. రాహుల్‌ గాంధీ పేరు చెప్పి కేటీఆర్‌ తప్పించుకోవాలని చూస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్‌ ఆయనకు మద్దతు తెలిపారని మండిపడ్డారు.

 

Tags :