మంత్రి కేటీఆర్‌కు కజకిస్తాన్ ఆహ్వానం

మంత్రి కేటీఆర్‌కు కజకిస్తాన్ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కజకిస్తాన్‌ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కజకిస్తాన్‌ వేదికగా జరిగే 2022 డిజటల్‌ బ్రిడ్జి ఫోరమ్‌ సదస్సుకు రావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో బ్రిడ్జి ఫోరమ్‌ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జి ఫోరమ్‌ సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. బిగ్‌డేటా, క్లౌడ్‌  సొల్యూషన్స్‌, డిజిటల్‌ సేవలపై సదస్సు నిర్వహించనున్నారు.

 

Tags :