నల్ల చట్టాల్లో కాదు..శ్వేత పత్రాల్లో పోటీ : మంత్రి కేటీఆర్

నల్ల చట్టాల్లో కాదు..శ్వేత పత్రాల్లో పోటీ : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ విభాగాలకు రూ.2 లక్షల 71 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ దని అన్నారు. తాను తెలంగాణ భవన్‌ వేదికగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు సవాల్‌ విసురుతున్నా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి, ప్రజలను గందరగోళం పరచడం సరికాదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  రైతులకు ఎంత మేలు చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. నల్ల చట్టాల్లో కాదు, శ్వేత పత్రాలు ప్రచురించే ప్రభుత్వం తమదని అన్నారు. నల్ల చట్టాలు తీసుకు వచ్చే ప్రభుత్వం మీది. మీకు మాకు పోలికే లేదని అన్నారు. తిట్ల పురాణం కాదు, దమ్ముంటే రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తే అభ్యంతరం లేదని అన్నారు. తెలంగాణ పర్యాటక రంగానికి మేలు జరుగుతుందన్నారు. తెలంగాణకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైనా, ప్రభుత్వం పైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. గణాంకాలు ఉంటే చెప్పాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటేనే నో డేటా అవేలబుల్‌ ప్రభుత్వం అని పేర్కొన్నారు.

 

Tags :