యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం...భారీగా ఏర్పాట్లు

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్యంత్ సిన్హా జులై 2వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో సిన్హాకు స్వాగత ఏర్పాట్లు, ఆయనకు మద్దతుగా నిర్వహించే సభపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంత్రులు, ఇతర నాయకులతో సమావేశం నిర్వహించారు. యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలుకాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రులకు కేటీఆర్ ఆదేశించారు. 2వ తేదీన ఉదయం 10 గంటలకు యశ్వంత్ సిన్హా ఎయిప్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ్నుంచి నేరుగా జలవిహార్‌కు సిన్హా చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించనుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
Tags :