టాటా-లాక్‌హిడ్‌ భాగస్వామ్యం శుభపరిణామం : మంత్రి కేటీఆర్

టాటా-లాక్‌హిడ్‌ భాగస్వామ్యం శుభపరిణామం : మంత్రి కేటీఆర్

టాటా-లాక్‌హిడ్‌ మార్టిన్‌ భాగస్వామ్యం శుభపరిణామమని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారు ఆదిభట్లలో టాటా ఏకోస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఫైటర్‌ వింగ్స్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మేడిన్‌ హైదరాబాద్‌గా ఫైటర్‌ వింగ్స్‌ తయారు చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ ఎకోసిస్టమ్‌ తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగాయనడానికి ఎఫ్‌-16 వింగ్‌ సర్టిఫికేషన్‌, డెలివరీ గొప్ప సాక్ష్యంగా నిలిచాయన్నారు. ఏరోస్పెస్‌, డిఫెన్‌స ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి టాటా, లాక్‌హీడ్‌ మార్టిన్‌ చేసిన నిరంతర సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ రెండు రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో ఇండియాలోనే తెలంగాణ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఈ రంగం గత ఐదేండ్లలో అపూర్వమైన వృద్ధి సాధించిందని స్పష్టం చేశారు. ఐదేండ్లుగా తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. టీఎస్‌ ఐపాస్‌తో వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి కొనసాగుతోందన్నారు. ఏరోస్పెస్‌ సెక్టార్‌లో 2020లో తెలంగాణకు అవార్డు వచ్చిందని అన్నారు.

 

Tags :