ఆధారాలుంటే నిరూపించు.. లేకపోతే ప్రజలకు

ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్ నిర్వాకమే కారణమని దీనిపై సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని బండి సంజయ్ ఆరోపించారు. సంజయ్ ఆరోపణలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సంజయ్వి హాస్యాస్పదమైన, ఆధార రహితమైన ఆరోపణలు అని కేటీఆర్ పేర్కొన్నారు. సంజయ్ ఆధారాలుంటే నిరూపించు లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రచారం కోసం సంజయ్ వాక్చాతుర్యం ప్రదర్శించొద్దు. నిరాధార ఆరోపణలు ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేకపోతే ప్రజలకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Tags :